కేబీఆర్ పార్కులో వాకింగ్‌కి వెళ్లిన తనను ఓ వ్యక్తి ఫాలో అయి వేధింపులకు గురి చేసినట్లు యువనటి షాలూ చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిపై కేసు కూడా ఫైల్ చేసి అతడిని అరెస్ట్ చేయాలని కోరింది. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం తెలిసేసరికి ఆమెకి సౌండ్లు లేవ్.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ లో బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో షాలూ వాకింగ్ చేస్తుండగా.. ఓ గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడట. తను ఆగిన చోట ఆగుతూ.. నడిస్తే నడుస్తున్నాడని గమనించి, పలుమార్లు చెక్ చేసుకుని, ఆ తర్వాత అక్కడున్న కొందరి వ్యక్తులు, పార్క్ సిబ్బందికి విషయం తెలియజేసింది. దీంతో అక్కడివారు వీరోచితంగా ఆ వ్యక్తిని పట్టుకుని కొండాపూర్ పోలీసులకు అందించారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యువకుడి పేరు శేఖర్. అలాగే తాను ఎవర్నీ వెంబడించలేదని, తన మానాన తాను వాకింగ్ చేస్తున్నట్లు అతడు తెలిపాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అతను నిజమే చెబుతున్నట్లు నిర్థారణ చేసుకున్నారు పోలీసులు. ఆ యువకుడిని వదిలేసి.. యువనటి చౌరాసియా కు తమ పద్ధతిలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
అయితే, షాలూ చౌరాసియాకి రెండేళ్ల క్రితం ఇదే కేబీఆర్ పార్క్‌లో లైంగిక వేధింపులకి గురైందట. 2021, నవంబర్ 17 న ఓ రోజు సాయంత్రం వాకింగ్ వచ్చిన ఆమెను ఓ అగంతకుడు వెంటాడి, లైంగిక దాడికి ప్రయత్నించాడు. కుదరకపోవడంతో దాడి చేసి సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లాడు. మళ్లీ అలా జరగుతుందనే భయంతోనే ఆ వ్యక్తిపై నటి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
నాకు కోపం వచ్చింది..ఆ హీరో చెంప పగలగొట్టా: నోరా ఫతేహి
జిమ్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు…లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!!