ఐపీఎల్‌ పార్టీల్లో డ్రగ్స్.. నటి సంచలన ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్‌ పార్టీల్లో డ్రగ్స్.. నటి సంచలన ఆరోపణ

September 25, 2020

womeen

హిందీ, కన్నడ, తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ వివాదం దుమారం రేపుతోంది. నటుడు సుశాంత్ మరణం తరువాత రియా విచారణలో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేసింది. ఎన్సీబీ విచారణలో పలువురు హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చాయి. వారిలో రకుల్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధ దాస్, నమ్రత శిరోద్కర్, దియా మీర్జా పేర్లు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నటి షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. 

క్రికెట్ రంగంలో కూడా డ్రగ్స్ కల్చర్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడతారని వెల్లడించింది. తాను ఒక సారి ప్రత్యక్షంగా చూశానని చెప్పుకొచ్చింది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పార్టీకి తాను హాజరయ్యానని చెప్పింది. ఆ పార్టీకి క్రికెటర్లతో పాటు వారి భార్యలు కూడా వచ్చారని తెలిపింది. అక్కడి వాష్ రూమ్‌లో క్రికెటర్ల భార్యలు కొకైన్ మత్తులో ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చానని చెప్పింది. షెర్లిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఆమె ఇలా ఆరోపణలు చేయడం గమనార్హం. ఎన్సీబీ అధికారులు క్రికెట్‌పై కూడా దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు.