సినిమా పరిశ్రమ ద్వారా ఫేమస్ అయిన పదం క్యాస్టింగ్ కౌచ్. అనేక మంది నటీమణులు ఈ అనుభవాన్ని ఫేస్ చేసినవారే. తాజాగా మరోనటి తనకెదురైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. హిందీ సీరియళ్లలో నటించే శివ పఠానియా మాటల్లో ‘ఓ దశలో ఎనిమిది నెలల పాటు దిక్కుతోచక ఉండిపోయాను. అవకాశాల్లేక ఖాళీగా రోజులు వెళ్లదీశాను. అలాంటి పరిస్థితిలో ఆడిషన్‌కు రమ్మని ఫోన్ వచ్చింది.
ముంబైలోని శాంతాక్రాజ్లో ఓ చిన్న గదిలో ఆడిషన్ పెట్టారు. లోపలికి వెళ్లగా, ఓ వ్యక్తి కూర్చుని ల్యాప్‌టాప్‌లో హనుమాన్ చాలీసా వింటున్నాడు. అతడిని పలకరించగా, నువ్వు నాతో ఒకరోజు కాంప్రమైజ్ అయ్యావంటే నిన్ను ఓ పెద్ద హీరో పక్కన యాడ్‌లో నటింజేస్తానని చెప్పాడు. దాంతో నేను నీకేమైనా సిగ్గుందా? హనుమాన్ చాలీసా వింటూ నన్ను ఏం అడుగుతున్నావు? అని తిట్టి వచ్చేశాను. తర్వాత తెలిసిందేంటంటే.. అతను ఫేక్, అతని బ్యానర్ ఫేక్. ఈ విషయంలో నా ఫ్రెండ్స్‌కి జాగ్రత్తలు చెప్పాను’ అని తన అనుభవాన్ని పంచుకుంది.