మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

మిస్ ఇండియా పోటీలకు హీరో రాజశేఖర్ కూతురు

April 18, 2022

rajj

సినీ హీరో, యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని తనకు సంబంధించిన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకొంది. త్వరలో జరగబోయే మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొనబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందుకు మీ మద్ధతు కావాలని అభిమానులను కోరింది. ఈ సందర్భంగా ‘ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా సంస్థకు థ్యాంక్స్. పోటీలో పాల్గొనబోతున్న తోటి మహిళలకు, నాకు ఆల్ ద బెస్ట్’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు శివాని విజయం సాధించాలని విష్ చేస్తున్నారు. కాగా, రాజశేఖర్‌కు ఇద్దరు కూతుళ్లు అన్ని విషయం తెలిసిందే. ఇద్దరు కూడా ఇప్పటికే సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శివాని ఇటీవల వచ్చిన ‘అద్భుతం’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం శివాని రెండు సినిమాలో నటిస్తుండగా, ఇందులో ఒకటి తమిళ సినిమా ఉంది. శివాని 1996లో జన్మించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి సినిమాల మక్కువతో 2018లో వచ్చిన ‘2 స్టేట్స్’ అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఇప్పుడు తండ్రి రాజశేఖర్‌తో కలిసి ‘శేఖర్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నవారు, టైటిల్ గెలిచిన వారు సినిమాల్లో నటించేవారు. కానీ, శివానీ మాత్రం ముందు సినిమాల్లో ప్రూవ్ చేసుకొని అందాల పోటీల్లో పాల్గొంటోంది. పోటీలో శివాని గెలుపొందాలని సగటు ప్రేక్షకుడిగా మనం కోరుకుందాం.