హీరోయిన్‌కు వింత అనుభవం.. దోచుకుంటున్నారంటూ విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్‌కు వింత అనుభవం.. దోచుకుంటున్నారంటూ విమర్శలు

March 31, 2022

herone

నేచురల్ స్టార్ నానితో కలిసి జెర్సీ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆ అనుభవాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. విషయంలోకెళితే.. ఇటీవల సదరు హీరోయిన్ ఓ ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తూ ఓలా క్యాబ్ బుక్ చేసుకొని అందులో ప్రయాణించింది. ఈ సందర్భంగా డ్రైవర్ వ్యవహరించిన తీరు ఆమెను విస్మయానికి గురి చేసింది. చెమట పడుతుంది. ఏసీ ఆన్ చేయమంటే.. ‘డీజిల్ రేట్లు పెరిగాయి. ఏసీ ఆన్ చేయడానికి కుదరదు. దీని వల్ల డీజిల్ కొంత సేవ్ అవుతుంది’ అంటూ బదులిచ్చాడు. అంతేకాక, ఓలా వల్ల తాము ఎంత నష్టపోతోందీ సవివరంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని పోస్ట్ చేసిన శ్రద్ధా.. ‘డ్రైవర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. డబ్బు సేవ్ చేయడాన్ని తప్పుపట్టలేం. అతను తన కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. ఓలా క్యాబ్ కంపెనీ వాళ్ల కష్టాన్ని దోచుకుంటోంది’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాగా, మలయాళంలో కోహినూర్ చిత్రం ద్వారా పరిచయమైన శ్రద్ధా, ఆ తర్వాత కన్నడలో యూ టర్న్ చిత్రం ద్వారా హిట్ కొట్టింది. తాజాగా ఒక తెలుగు సినిమాతో పాటు రెండు కన్నడ సినిమాల్లో నటిస్తోంది.