రూ. 200 ఇస్తే మీతో కలిసి డ్యాన్స్ చేస్తానంటున్న శ్రియా
హీరోయిన్ శ్రియ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ. 200 చెల్లిస్తే చాలు మీతో కలిసి డ్యాన్స్ చేస్తానంటూ పేర్కొంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకొని పోయిన కూలీలు, అనాథలు,వృద్ధుల కోసం సాయం చేసేందుకు ఇలా వచ్చిన డబ్బులను వినియోగిస్తానని ప్రకటించింది. తనతో డ్యాన్స్ చేయాలని అనుకునే వారు www.thekindnessproject.in లో రూ.200 విరాళం చెల్లించి, మీ రిసిప్ట్‌ను ఈమెయిల్ చేస్తే సరిపోతుంది.
ఈ ఆఫర్ శనివారం వరకు మాత్రమే ఉంటుంది. ఆలోపు డబ్బులు చెల్లించిన వారిలో ఇద్దరు విజేతలను ఎంపిక చేసి వారితో ఆదివారం రోజు వీడియో కాల్ ద్వారా స్టెప్పులేస్తానని చెప్పింది. అంతే కాదు ఆమెతో కలిసి కాసేపు యోగా కూడా చేయవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కరోనా బాధితులకు అండగా నిలవాలని కోరింది. కాగా ప్రస్తుతం శ్రియ తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్న ఆమె కరోనా బాధితుల సాయం కోసం కైడ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్ ఫోర్స్ బృందాలతో కలిసి పని చేస్తున్నారు. ఈ మంచి పని కోసం తనతో చేతలు కలపాలని ఆమె కోరారు.