Actress Shriya Saran Looks Super HOT In New Ad
mictv telugu

శ్రియా కక్కుర్తి.. పైసల కోసం స్నానం చేస్తూ.. 

November 9, 2022

అప్పుడెప్పుడో ఇష్టం సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీయ.. కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలలోని అగ్రహీరోలతో యాక్ట్ చేసింది. 40 ఏండ్లలోకి అడుగుపెట్టినా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఆ టైమ్‌లో స్టార్స్‌గా రాణించిన హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీయ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ గ్లామర్ షో చేస్తుంది. గట్టిగా మాట్లాడితే.. పెళ్లై, బిడ్డకు తల్లయిన తర్వాతే సోషల్ మీడియాలో సైతం హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తోంది. కొత్తగా యాడ్స్‌లో సైతం చెలరేగిపోతుంది. ఇందుకు భర్త అండ్రూ ఎంకరేజ్మెంటే కారణమంటారు అంతా.

ఇటీవల కూతురితో సముద్ర తీరంలో దిగిన బికినీ ఫోటోలతో రచ్చ లేపిన శ్రీయ.. తాజాగా స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే అది ఓ యాడ్‌లో. వీనస్ స్ప్లాష్ ప్రో టీవీసీ కంపెనీ ఉత్పత్తి అయిన బాత్ వాటర్ హీటర్ కోసం ఒక యాడ్ లో స్నానం చేస్తున్నట్టు బోల్డ్ వీడియోలో పాల్గొంది. హాట్ వాటర్‌తో స్నానం చేస్తూ.. ఊరించి, ఉడికిస్తోంది. ఆ యాడ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ రేంజ్ లో ఏ హీరోయిన్ కూడా ఇంత బోల్డ్ గా చేసి ఉండదని కొందరు అంటుంటే.. పైసలు కోసం ఇంత కక్కుర్తా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆవిడ అభిమానులు మాత్రం కన్నుల పంటగా ఉందని అంటున్నారు.