చిక్కుల్లో శ్రియ.. లండన్ పోలీసులు పట్టుకున్నారట! - MicTv.in - Telugu News
mictv telugu

చిక్కుల్లో శ్రియ.. లండన్ పోలీసులు పట్టుకున్నారట!

December 12, 2019

Shriya Saran02

నటి శ్రియ లండన్‌ పోలీసుల చేతికి చిక్కి షాక్‌కు గురైంది. ఆమె ప్రస్తుతం తమిళంలో ‘సందకారి’ అనే చిత్రంలో నటిస్తోంది. విమల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ మాదేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్‌ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. 

ఇటీవల ‘సండైక్కారి’ చిత్ర షూటింగ్‌ లండన్‌లోని స్టెన్‌పోర్టు విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ షూటింగ్‌లో విమల్, శ్రియ, సత్యన్‌ పాల్గొన్నారు. అప్పుడు తెలియకుండా ఎయిర్‌పోర్ట్‌లోని హై సెక్యూరిటీ ప్రాంతంలోకి శ్రియ అనుమతి లేకుండా వెళ్లడంతో పోలీసులు గన్ పాయింట్‌లో ఆమెను పట్టుకున్నారట. భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి అనధికారికంగా ఈ ప్రాంతంలోకి ఎలా వస్తావు? అంటూ ప్రశ్నించారు. దీంతో శ్రియ బెంబేలెత్తిపోయింది. అక్కడే ఉన్న విమల్‌‌తో పాటు యూనిట్ సభ్యులు పోలీసులతో మాట్లాడి వారికి షూటింగ్ డాక్యుమెంట్స్ చూపించాక పోలీసులు శ్రియను వదిలేశారట. అయితే ఈ విషయమై శ్రియ నుంచి కానీ యూనిట్ సభ్యుల నుంచి కానీ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.