విడాకులు తీసుకోబోతున్న కొత్త బంగారులోకం హీరోయిన్  - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులు తీసుకోబోతున్న కొత్త బంగారులోకం హీరోయిన్ 

December 10, 2019

Shweta Basu01

పెళ్లైన ఏడాదికే యంగ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని తాను తన భర్త రోహిత్ మిట్టల్ కొన్ని రోజుల క్రితమే నిర్ణయించుకున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని నెలలుగా తమ మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. 

‘ఇంతకు ముందు వరకు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన అది చెడ్డది కాదు. కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం మంచిది. ఎప్పుడూ నాకు స్ఫూర్తిగా ఉంటూ.. ఎన్నో మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు థ్యాంక్యూ రోహిత్‌ అంటూ పోస్టు పెట్టారు. పెళ్లైన ఏడాదికే ఇద్దరూ ఇలా విడాకులు తీసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.  

కాగా 2018 డిసెంబర్‌ 13న శ్వేతాబసు వ్యాపారవేత్త రోహిత్‌ను వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు వీరి పెళ్లిని పుణెలో ఘనంగా నిర్వహించారు.చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు పలు సినిమాలు, సీరిళ్లలో నటిస్తున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరయ్యారు.