ఒక్క నెలకే రూ.70 వేల కరెంట్ బిల్లు.. నటి స్నేహ భర్తకు నోటీసులు - Telugu News - Mic tv
mictv telugu

ఒక్క నెలకే రూ.70 వేల కరెంట్ బిల్లు.. నటి స్నేహ భర్తకు నోటీసులు

June 4, 2020

snaka01

సినీ నటి స్నేహ భర్తకు విద్యుత్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం ఒక్క నెలకే ఇంటి కరెంట్ బిల్లు రూ. 70 వేలు చెల్లించాలని సూచించారు. దీనికి నోటీసులు కూడా అందించారు. ఆ బిల్లు చూసిన ప్రసన్న ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంత బిల్లు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రసన్న, ఆయన తండ్రి, మామ ఇళ్లకు మొత్తంగా రూ. 70 వేల బిల్లు వచ్చింది. వీటిని చెల్లించాలని ప్రసన్నకు నోటీసులు ఇచ్చారు. గతంలో తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాలేదని ఇప్పుడు ఇలా రావడం ఏంటని నిలదీశారు. ఈ బిల్లు చెల్లించడం తనకు పెద్ద కష్టం కాదని.. కానీ పేదవారికి కూడా ఇలా తప్పుల తడకలా బిల్లు పంపితే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయాని గుర్తించారు. వెంటనే వాటిని సరి చేసి కొత్త బిల్లు పంపిస్తామని అన్నారు. ఈ వ్యవహారంతో తమిళనాడు విద్యుత్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.