నందమూరి బాలకృష్ణ మాస్ పల్స్ తెలిసిన స్టార్ హీరో. అగ్ర హీరోగా కొన్నేళ్లుగా టాలీవుడ్ ని ఏలుతున్నాడు. యువ హీరోలకి ధీటుగా చిత్రాలను చేసే బాలయ్యతో సినిమా అంటే దర్శకులు, నటులు క్యూ గడతారు. బాలయ్య ఇచ్చే ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే వారికి తెలుసు బాలయ్యతో ఒక్క మంచి సినిమా పడితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చని. అయితే ఆరు పదుల వయసులోనూ యాక్షన్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న బాలకృష్ణ NBK108 మూవీ కోసం శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బోల్డ్ లేడి సోనాక్షి సిన్హా నటించబోతున్నారు అంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే కారణమేంటో కానీ ఈ బాలయ్య 108 మూవీ నుండి ఈ బొద్దుగుమ్మ తప్పుకుందంటూ అంతలోనే వార్తలు వస్తున్నాయి. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయటమే ఆమె ఎగ్జిట్ కి ఒక కారణమని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై బాలీవుడ్ మీడియాతో ఎట్టకేలకు స్పందిస్తూ.. పుకార్లకు చెక్ పెట్టింది సోనాక్షి సిన్హా.
బాలకృష్ణ గోపీచంద్ మలినేనిల ‘వీరసింహా రెడ్డి’ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రం తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య 108చిత్రం పట్టాలెక్కనుంది. NBK108 వర్కింగ్ టైటిల్ ఇప్పటికే తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా పెట్టుకోనున్నారని.. దీనికి సోనాక్షి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. అయితే భారీ పారితోషకం డిమాండ్ చేయటంతో ఆమె స్థానంలో మరొక బాలీవుడ్ హీరోయిన్ ని అనిల్ రావిపూడి సెట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ కథనాలని సోనాక్షి కొట్టిపారేసింది. నంబర్ వన్ స్థానంలో లేని హీరోయిన్ ని ఎవరు తప్పించలేరు అని సెటైర్స్ వేసింది. ‘‘తెలుగు సినిమాలో నేను యాక్ట్ చేయబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వార్తలు వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పుడు ఆ సినిమా నుంచి నేను తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అయినా.. ఇప్పటి వరకు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో లేని హీరోయిన్ని ఎవరైనా సినిమా నుంచి తప్పిస్తారా? ’’ అంటూ తనపై తానె కామెడీ చేసింది.