Actress Sonal Chauhan praised Prabhas Adipurush movie
mictv telugu

ప్రభాస్ ‘ఆదిపురుష్’ బాలీవుడ్‌ని విడగొట్టేస్తుంది.. నటి సంచలన వ్యాఖ్యలు

September 17, 2022

బాహుబలి హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అప్డేట్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ, చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రావట్లేదు. అన్నీ రూమర్లే వస్తుండడంతో ఒకింత నిరాశ వాతావరణం నెలకొంది.

ఈ సమయంలో ఈ చిత్రంలో నటించిన నటి సోనాల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌తో కలిసి నటించడమే ధ్యేయంగా ఉన్న తనకు ఆదిపురుష్ సినిమాలో అవకాశం రావడం అదృష్టమని తెలిపింది. సినిమాలో పాత్ర కోసం ఫోన్ చేసినప్పుడు నమ్మలేదని చెప్పింది. ‘అసలే రామాయణం ఆధారంగా తీస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ను ఆదిపురుష్‌కి ముందు ఆది పురుష్ తర్వాత అంటారు. అంత అద్భుతంగా సినిమా వస్తోంది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. దీంతో ఈ వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. కాగా, దసరా కానుకగా టీజర్ వస్తుందని, అయోధ్యలో విడుదల చేస్తారని మరో రూమర్ వచ్చింది. దీనిని చిత్ర యూనిట్ అధికారికంగా అవును అని కానీ, కాదు అని కానీ అనలేదు.