లాక్‌డౌన్ తిప్పలు.. మేకప్‌ మ్యాన్ వద్ద అప్పు చేసిన సీరియల్ నటి  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ తిప్పలు.. మేకప్‌ మ్యాన్ వద్ద అప్పు చేసిన సీరియల్ నటి 

May 16, 2020

Actress Sonal Vengurlekar Financial Situation

పేదలకే కాదు.. కొన్ని సార్లు బాగా పేరున్న వారికి కూడా లాక్‌డౌన్ తిప్పలు తప్పడం లేదు. సమయానికి చేతిలో డబ్బులు లేక తెగ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటిదే ప్రముఖ టీవీ సీరియల్ నటి సోనాల్ వెంగర్లేకర్‌కు ఎదురైంది. చేతిలో డబ్బులు లేక, ఇచ్చే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చివరకు మేకప్ మ్యాన్ వద్ద అప్పు చేసింది. ఖర్చుల కోసం రూ. 15 తీసుకున్నట్టుగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 

తనకు ఈ లాక్‌డౌన్‌లో ఎదురైన అనుభావాలను అభిమానులతో పంచుకున్నారు.రెండు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో చేతిలో డబ్బులన్ని ఖర్చు అయిపోయాయి. దీంతో ఓ నిర్మాతకు ఫోన్ చేయగా అతడు మొహం చాటేశాడు. చేసేదేమి లేక తెలిసిన మేకప్ మ్యాన్ పంకజ్ గుప్తాకు ఫోన్ చేసి సాయం అడిగింది. దీంతో అతడు తన భార్య డెలివరీ కోసం దాచుకున్న రూ.15 వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి తన భార్య డెలివరీ సమయానికి ఇస్తే చాలని చెప్పడంతో ఆమె బాధతో ఈ పోస్ట్ చేసింది. అతడు చేసిన సాయానికి తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చింది. కాగా సోనాల్ వెంగర్లేకర్ ప‌లు హిందీ టీవీ సీరియ‌ల్స్‌లో న‌టి చాలా మందికి సుపరిచితురాలు అయ్యారు. అలాంటి ఆమె డబ్బులు లేకుండా ఎందుకు ఉన్నారంటూ పలువురు పశ్నిస్తున్నారు.

View this post on Instagram

@pankajgupt09 ♥️

A post shared by Sonal Vengurlekar (@sonal_1206) on