ఆత్మహత్యకు ముందు రోడ్డుపై శ్రావణి, సాయి ఫైట్.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మహత్యకు ముందు రోడ్డుపై శ్రావణి, సాయి ఫైట్.. వీడియో

September 12, 2020

Actress Sravani, Sai fight on the road before committing incident.. Video.

మౌనరాగం, మనసు మమత సీరియళ్లలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన యువనటి శ్రావణి ఆత్మహత్య కేసు బుల్లితెర ప్రేక్షకులను తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఇప్పటికే టిక్‌టాక్ స్టార్ దేవేందర్ రెడ్డి, సాయికృష్ణా రెడ్డిలను అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరు శ్రావణిని ప్రేమించారని ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. తొలుత సాయితో ప్రేమలో పడ్డ శ్రావణి, ఆ తర్వాత దేవరాజ్ పరిచయం కావడంతో సాయిని దూరం పెట్టినట్టు సమాచారం. ఈ కారణంగానే సాయి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడని పోలీసులు తేల్చారు. శ్రావణిపై కోపం పెంచుకున్న సాయి ఆమెపై చేయి చేసుకున్న ఓ సీసీటీవీ వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో.. సెప్టెంబర్ 7న దేవరాజ్, శ్రావణి ఎస్సార్‌ నగర్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ వీరిద్దరినీ చూసిన సాయి కోపంతో శ్రావణిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన శ్రావణి ఆటోలో ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అప్పుడు సాయి ఆటోకు అడ్డుపడి వాగ్వాదానికి దిగాడు. శ్రావణి ఇంటికి చేరుకునేలోపే ఆ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, సాయి కలసి ఇంటికి వచ్చిన శ్రావణిని విపరీతంగా కొట్టారు. తనను కొడుతున్న సమయంలోనే శ్రావణి దేవరాజ్‌కు ఫోన్ చేసింది. దేవరాజ్ ఆ గొడవను తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది.  పోలీసుల విచారణ సందర్భంగా దేవరాజ్ ఈ విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డితో సహజీవనం చేయాలంటూ శ్రావణిపై సాయి ఒత్తిడి తెచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నిర్మాతను పోలీసులు ఆదేశించారు.