actress sri reddy comments on ex tdp leader divyavani
mictv telugu

వాడుకొని వదిలేస్తారని ముందే చెప్పా : శ్రీరెడ్డి

June 9, 2022

actress sri reddy comments on ex tdp leader divyavani

టీడీపీని వదిలేసి ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన దివ్వవాణి వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. ‘టీడీపీ వాళ్లకు వాడుకొని వదిలేయడం అలవాటే. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే చెప్పా’నంటూ మ్యాటర్‌లోకి వచ్చింది శ్రీరెడ్డి. దాంతో పాటు ‘దివ్వవాణికి ఎప్పుడో చెప్పాను. టీడీపీ వాళ్లు పిండి వదిలేస్తారని హెచ్చరించాను. పార్టీలోకి వచ్చిన తర్వాత డబ్బుల సంపాదించడం అటుంచి సొంత నిధులు ఖర్చు పెట్టుకోవాలి. టీడీపీని వదిలి బయటికి వచ్చిన తర్వాత వాళ్లను ఓ రేంజులో వేసుకున్నారు. అది నాకు బాగా నచ్చింది.

వాళ్లు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరు. సాధినేని యామిని కూడా మీలా ఏడ్చి బయటకు వెళ్లింది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీగా టీడీపీపై నాకు గౌరవం ఉంది. కానీ, తర్వాత అందులో చేరిన వాళ్లు దానిని చెడగొట్టేశారు. గతంలో వైసీపీని తిట్టొద్దని, ఇలాంటి రోజు వస్తుందని మీకు చెప్తూనే ఉన్నా. ఇప్పటికైనా మీకు అర్ధమైంది. మీలాగా ఇంకా ఆ పార్టీలో ఉన్నవాళ్లకు కూడా త్వరలో కళ్లు తెరుస్తారని ఆశిస్తున్నా’నంటూ హితవు పలికింది.

https://fb.watch/dxu-pZJ04n/