శ్రీరెడ్డి సక్సెస్.. కమిటీని వేసిన తెలంగాణ ప్రభుత్వం.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి సక్సెస్.. కమిటీని వేసిన తెలంగాణ ప్రభుత్వం..

April 17, 2019

తెలుగు సినీపరిశ్రమలో మహిళలపై సాగుతున్న లైంగిక దోపిడీపై అన్నీ తానై ఉద్యమం నడిపిన నటి శ్రీరెడ్డి పోరాటం ఫలించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. గతంలో వివిధ మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఒక జీవోను కూడా విడుదుల చేసింది.  

984 నంబరుతో వచ్చిన ఈ జీవో కింద.. తారలు సుప్రియ, యాంకర్ ఝాన్సీ, డైరెక్టర్ నందిని రెడ్డిలను కమిటీలో టాలీవుడ్‌ ప్రతినిధులుగా ప్రభుత్వం  నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కాలేజీ వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలతో ఈ కమిటీనీ ఏర్పాటు చేశారు.

Actress Sri reddy struggle success  as Telangana government forms committee on sexual exploitation in Hollywood.

తెలంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా ఇందులో సభ్యులు. రాంమోహన్ రావు ఈ కమిటీకి సారథ్యం వహిస్తారు. పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల్లోని  మహిళలు తమ ససమ్యలను ఈ కమిటీకి చెప్పుకోవచ్చు. దోషులను కఠినంగా శిక్షించేర అధికారం ఈ కమిటీకి ఉంటుంది. అవకాశాలు ఇస్తామంటూ పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనికి నిరసనగా ఆమె ‘మా’ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు అభిరాం తనను లైంగికంగా వాడుకుని మోసం చేశారంటూ ఆమె విడుదల చేసిన  ఫొటోలు కలకలం రేపాయి.