సభ్యత్వం లేకున్నా వైసీపీ పార్టీకి గట్టి మద్ధతుగా నిలిచే బోల్డ్ యాక్టర్ శ్రీరెడ్డి ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. ఎప్పుడూ విమర్శించే టీడీపీని మొదటిసారి మెచ్చుకుంటూ అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఈ మేరకు ఆమె ఫేస్బుక్‌లో లైవ్‌లో మాట్లాడింది. అందులోని ఆమె మాటల ప్రకారం.. ఏపార్టీ అయినా కార్యకర్తలను దూరం చేసుకోకూడదు. పథకాలు చూసి జనం ఓట్లేస్తారు. గెలిచేస్తాం అనుకుంటే పొరపాటు. 20 నుంచి 30 సీట్లు తగ్గినా జనంలో అసంతృప్తి ఉన్నట్టు భావించాలి. ఎవ్వరికీ అధికారం శాశ్వతం కాదు. పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలి. అందరూ అనుకుంటారు. నాకు వైసీపీ వాళ్లు బాగా డబ్బులిస్తారని. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే అకౌంటులో డబ్బు పడిపోదు. నేను, మా నాన్న మా ఊరిలో వెంకటేశ్వరుడి గుడి కడదామని నానా తిప్పలు పడుతున్నాం. భూమి సమకూరింది కానీ నిధులు సరిపోవడం లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం నిధులు వచ్చాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం అనుకున్నది నెరవేరలేదు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలను ఎంత ఫోన్ చేసి అడిగినా లాభం లేకుండా పోయింది. ఎన్నిసార్లు అడిగినా దిక్కు లేకుండా పోయింది. ఎవరితో చెప్పుకోవాలి? నాకు ఇంత అన్యాయం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను చాలా హర్ట్ అయ్యాను. వైసీపీని నమ్ముకొని ఒక్క రూపాయి కూడా తినకపోగా, దేవుడికి కనీసం గుడి కట్టించలేకపోయాను’ అంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కింది శ్రీరెడ్డి.