actress suhasini comments on hindi - tamil orgument
mictv telugu

హిందీ గొడవ.. నటి సుహాసిని వివాదాస్పద వ్యాఖ్యలు

May 3, 2022

actress suhasini comments on hindi - tamil orgument

హిందీ – తమిళ్ భాషల గురించి ఉత్తరాది, దక్షిణాది భాషల నటులు, రాజకీయ నాయకుల మధ్య చిన్నపాటి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ వివాదంలోకి సీనియర్ నటి, ప్రముఖ దర్శకుడు మణిరత్నం భార్య సుహాసని ఎంటరయ్యారు. నటులకు భాషల అంతరంపై ఆమె రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో స్పందించారు.

‘నటులు అన్న తర్వాత అన్ని భాషలూ నేర్చుకోవాలి. హిందీ భాష చాలా బాగుంటుంది. అదికూడా నేర్చుకోవాలి. హిందీ వాళ్లు చాలా మంచివాళ్లు. అలాగే హిందీ వాళ్లు కూడా తమిళం నేర్చుకోవాలి. ఇలా అందరూ కలిసిమెలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది. నా ఇంట్లో పనిచేసే వాళ్లలో తెలుగుతో పాటు హిందీ మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. ఈ భాషే కావాలని మొండికేస్తే మనకు తినడానికి తిండి కూడా దొరకదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో సుహాసినిని తమిళ ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. హిందీ కావాలనిపిస్తే ఆ భాషలోనే సినిమాలు చేసుకో అంటూ సెటైర్లు వేస్తున్నారు.