కొంగు చాచి అడుగుతున్నా.. ఓట్లేయండి: సుమలత - MicTv.in - Telugu News
mictv telugu

కొంగు చాచి అడుగుతున్నా.. ఓట్లేయండి: సుమలత

April 17, 2019

ఓట్ల కోసం రాజకీయ నేతలు ఎన్ని పనులైనా చేస్తారు. పిల్లల ముక్కుమూతి తుడవడాల దగ్గర్నుంచి దోసెలు పోయడం వరకకూ చక్కగా చేస్తారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లోనూ పోతాయారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన మాజీ నటి సుమలత చీరకొంగు చాచి మరీ ఓట్లు కోరుతున్నారు.

Actress sumalatha begging votes whith saree end in mandya from karnataka she contesting as her husband ambareesh died with illness

ఆమె భర్త, నటుడు అంబరీష్ ఇటీవల చనిపోవడం తెలిసిందే. దీంతో మాండ్య నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేడీఎస్ తదితర పార్టీలు.. ‘భర్త చనిపోయి నాలుగు  రోజులైనా కాలేదు, అంతలోపే రోడ్డుపైకి వచ్చింది..’ అని జేడీఎస్ నేతలు తిడుతున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు.

‘నెల రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాను. దారుణమైన అవమానాలను, అవహేళనలను, బెదిరింపులను ఎదుర్కొంటున్నాను.. అంబరీష్  మృతిని కూడా సీఎం కుమారస్వామి రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. మా ఆయన సమాధిపై సీఎం తన కొడుక్కి రాజకీయ బాటలు వేయాలని చూస్తున్నారు. కానీ అది సాద్యం కాదు. నాకు ఓటర్లపై నమ్మకం ఉంది. దయచేసి ఈ పరిస్థితులను గమనించండి.. నాకు ఓటేసి గెలిపించి. కొంగు చాచి మరీ అభ్యర్థిస్తున్నాను.. ’ అని ఆమె కోరారు.  ఆమె వెంట ప్రచారోం సినీ హీరోలు యశ్, దర్శన్‌ కూడా పాల్గొంటున్నారు. మాండ్య నుంచి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ జీడీఎస్ అభ్యర్థిగా పొటీ చేస్తున్నారు.