తాప్సి బాయ్ ఫ్రెండ్ వికారంగా ఉంటాడు..సోదరి - MicTv.in - Telugu News
mictv telugu

తాప్సి బాయ్ ఫ్రెండ్ వికారంగా ఉంటాడు..సోదరి

September 11, 2019

actress Taapsee....

‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన నటి తాప్సి పన్ను తాజాగా ఓ విషయాన్ని అంగీకరించారు. ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తాప్సి తొలిసారి ఒప్పుకున్నారు. అయితే, తాను ప్రేమిస్తున్న వ్యక్తి నటుడో, క్రికెటరో లేదా ఇతర సెలెబ్రిటీనో కాదని తెలిపారు. తాప్సి తన సోదరి షగున్‌తో కలిసి పింక్‌విల్లా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ… ‘నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నన్ను నిజంగా ఇష్టపడేవారు నా గురించి వచ్చే పుకార్లను పెద్దగా నమ్మరు. నా జీవితంలో ఉన్న వ్యక్తి నటుడో, క్రికెటరో కాదు.. అందరికీ ఆసక్తికరమైన రంగానికి చెందినవారు కాదు. పైగా అతను ఇక్కడికి సమీపంలో ఉన్నవాడు కూడా కాదు’ అని తెలిపారు. ఈ విషయమై షగున్‌ మాట్లాడుతూ..’ఈ విషయంలో తాప్సీ నాకు కృతజ్ఞతలు చెప్పాలి, నా ద్వారా తాప్సికి ఆ వ్యక్తి పరిచమయ్యాడు, ఇంతటి విచిత్రమైన వ్యక్తిని తాప్సీ ఎలా ఇష్టపడిందో అర్థం కావడం లేదు, ఇతను ఒకింత వికారమైన వ్యక్తి’ అన్నారు. దీనికి తాప్సీ బదులిస్తూ..‘నా రాకుమారుడిని కలిసేముందు నేను ఇంతకుముందు ఎన్నో కప్పలను ముద్దాడాను’ అంటూ జోక్ చేసారు.