actress tamanna marriage with big mumbai businessman
mictv telugu

అపరకుబేరుడితో తమన్నాపెళ్లి.. కానీ వరుడికి భయంకర వ్యాధి

November 16, 2022

actress tamanna marriage with big mumbai businessman

గత కొన్ని రోజులుగా తమన్నా పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మిల్కి బ్యూటీ వెడ్డింగ్ వార్తలే. అయితే ఇప్పటివరకు తమన్నా ఈ పెళ్లి వార్తలపై స్పందించలేదు. బజ్ క్రియేట్ అయితే మంచిదే కదా అని లైట్ తీసుకుందో లేక ఒంకేదైనా కారణమో కాని.. పెళ్లి నిజమనో లేక అబద్ధమానో ఒక్క కామెంట్ కూడా చేయలేదు తమన్నా. ఒకవేళ పెళ్లి వార్తలు తప్పు అయితే కనీసం సెటైర్ అయినా వేసేది.. అలాంటిది తమన్నా సైలెంట్ గా ఉందంటే డేట్ దెగ్గరపడిందనే అంటున్నారు. ముఖ్యంగా ముంబై సోషల్ మీడియాలో తమన్నా పెళ్లిపై పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. ముంబై నివాసి అయిన అపర కుబేరుడితో తమన్నా మూడు ముళ్ళు వేయించుకోబోతుందని అంటున్నారు. ఓల్డ్ ముంబైలో నివసించే ఒక బడా పారిశ్రామిక వేత్త కుమారుడితో పెళ్లి ఫిక్స్ అయిందని అంటున్నారు.

అయితే తమన్నా పెళ్లి చేసుకోబోయే వరుడికి మాత్రం ఒక విచిత్రమైన రోగం ఉందట. చిన్నప్పటి నుండి ఆ వ్యాధితో బాధపడుతున్న అతగాడికి ఎంత ట్రీట్మెంట్ చేసిన నయం కావట్లేదట. వంటికి పడని ఫుడ్ ఏదైనా తింటే వెంటనే వరుడికి రియాక్షన్ వస్తుందట. ముఖ్యంగా స్కిన్ రాషస్ వచ్చేస్తాయట. వాటిని గుర్తించుకుండా లేట్ చేస్తే.. ప్రాణనికే ప్రమాదం వస్తుందన్న రూమర్ తెగ తిరిగేస్తోంది. అంతే కాదు ఈ వ్యాది లేట్ చేస్తే ఓళ్లు అంతా పాకేస్తుందట. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. అయితే తమన్నా చేసుకోబోయేవాడికి సమంత లాగానే ఈ భయంకరమైన జబ్బు ఉండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నర్యు ఫ్యాన్స్. తమన్నా ఎందుకిలా వ్యాధి ఉన్న వ్యక్తిని పెళ్లాడుతుందని.. డబ్బు పిచ్చితొనే తమన్నా ఈ డెసిషన్ తీసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.