actress tamanna net worth assets value
mictv telugu

ప్రపంచంలోనే 5వ అతి పెద్ద వజ్రం.. తమన్నాకి బహుమతిగా ఇచ్చిన ఉపాసన

January 4, 2023

గత 17ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న అతికొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లో తమన్నా భాటియా ఒకరు. 2005లో ‘శ్రీ’ అనే తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిల్కి బ్యూటీ.. హ్యాపీ డేస్ మూవీతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుండి ఎక్కడ వెనుతిరిగి చూసుకోలేదు తమన్నా. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ అంటూ వరుస పెట్టి విరామం లేకుండా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. 33 ఏళ్ల వయసు, 17 ఏళ్ల కెరీర్‌లో అనేక హిట్లు, అవార్డులు, ప్రశంసలు అందుకున్న తమన్నా సంపాదనలోను ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకెళ్తుంది. ఆమె ఆస్తులు, రెమ్యునరేషన్ స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తమన్నా ఆస్తుల చిట్టా చూసిన వారందరు అవాక్కవుతున్నారు. CA నాలెడ్జ్ నివేదిక ప్రకారం.. తమన్నా ఆస్తుల నికర విలువని దాదాపు రూ. 110 కోట్లుగా పేర్కొంది. ఆమె నెలకి కోటి చొప్పున సంవత్సరానికి దాదాపు రూ. 12 కోట్లు సంపాదిస్తుందట.

అయితే MensXP నివేదిక ఆధారంగా తమన్నా ప్రతి చిత్రానికి దాదాపు రూ. 4-5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఐటెమ్ సాంగ్ కోసం రూ.60 లక్షలు డిమాండ్ చేస్తుందని నివేదిక తెలిపింది. ఇక 2018లో, ఐపీఎల్ ప్రారంభోత్సవంలో 10 నిమిషాల ప్రదర్శన కోసం ఆమె ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేసిందని ప్రచురించింది MensXP. మొబైల్ ప్రీమియర్ లీగ్, సెల్కాన్ మొబైల్స్, ఫాంటా, చంద్రిక వంటి ప్రముఖ బ్రాండ్‌ లు తమన్నా పాకెట్ లో ఉన్నాయి. వీటన్నిటితో పాటు తమన్న దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ వజ్రం ఉందని.. దాని విలువ సుమారు రెండు కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. ఈ ఖరీదైన వజ్రాన్ని మెగా కోడలు ఉపాసన కొణిదెల తమన్నాకి బహుమానంగా ఇచ్చిందని కూడా టాక్ ఉంది. ఇంతే కాకుండా తమన్నాకి ముంబాయిలోని వెర్సోవాలో రూ 16 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫ్లాట్, లాండ్ రోవర్ డిస్కవరీ, బీ.ఎం.డబల్యూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఆమె వాడే చానల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదే రూ 3 లక్షలుగా ప్రచారం జరుగుతుంది. ఇలా ఎలా చూసుకున్నా తమన్నాని అత్యంత విజయవంతమైన నటిగా చెప్పుకోవచ్చు.