ఎఫ్3లో పవన్ కల్యాణ్.. తమన్నా అలక - MicTv.in - Telugu News
mictv telugu

ఎఫ్3లో పవన్ కల్యాణ్.. తమన్నా అలక

May 26, 2022

కుటుంబ సమేతంగా చూసే కామెడీ చిత్రమని చెప్పుకుంటున్న ఎఫ్3 సినిమా గురించి నిర్మాత దిల్ రాజు క్రేజీ న్యూస్ వెల్లడించారు. సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నారని తాజగా బాంబు పేల్చారు. ప్రేక్షకులకు ఇదొక సర్‌ప్రైజ్ అని, ఏరకంగా చూసినా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, గ్లామర్ ఒలకబోయడంలో ముందుండే మిల్క్ బ్యూటీ తమన్నా ఎఫ్3 టీంపై అలక బూనిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఎఫ్2 లో ప్రధాన కథానాయికగా ఉన్న తమన్నా అందులో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దాంతో ఎఫ్3లోనూ తనకు ఫ్రాధాన్యం ఉంటుందని భావించింది. అయితే ఐటెం సాంగు కోసం పూజా హెగ్డేను తీసుకోవడంతో తొలుత బాధ పడినా, తర్వాత సరేలే ఒక్క సాంగే కదా అని సర్దుకుందట. తర్వాత సోనాల్ చౌహాన్‌ను కూడా తీసుకోవడంతో మొత్తంగా సినిమాలో నలుగురు కథానాయికలు అయ్యారు. దీంతో పాటు మిగతా హీరోయిన్ల కోసం తన పాత్ర నిడివి తగ్గించాంట. దీంతో తమన్నా మంకుతో ఎఫ్3 సినిమా ప్రమోషన్లకు రావడం లేదని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రిరిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత జరిగిన మీడియా ఇంటర్య్వూలకు తమన్నా హాజరు కాలేదు. ఈ విషయంపై చిత్ర బృందాన్ని అడిగితే బిజీగా ఉండడం వల్ల రాలేకపోయిందని కవర్ చేశారు.