Actress Tamannaah Bhatia reacted to the marriage news
mictv telugu

నా భర్త ఇతనే.. పరిచయం చేసిన తమన్నా

November 17, 2022

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్‌‌తో రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటి తమన్నా భాటియా. ముంబైకి చెందిన సింధీ కుటుంబంలో పుట్టిన తమన్నా ఇటీవల పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొందరు ఇంకాస్త ముందుకెళ్లి కాబోయే భర్త వ్యాపారవేత్త అని, అతనికి సమంత లాగే చర్మ సమస్యలున్నాయని తేల్చేశారు.

పెళ్లి కోసమే సినిమాలు ఒప్పుకోవట్లేదని కూడా రాసేశారు. ఈ వార్తలు తమన్నా వరకు వెళ్లాయేమో.. వెంటనే స్పందించింది. ఇదిగో ఇతనే నా భర్త అంటూ ఓ ఫోటో రివీల్ చేసింది. ఆ పోటో ఆమె ఇటీవల నటించిన తెలుగు సినిమా ఎఫ్ 3 లోని అబ్బాయి పాత్రకు సంబంధించింది. దాంతో పాటు ‘మ్యారేజ్ రూమర్స్’ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. దీన్ని బట్టి మిల్కీ బ్యూటీ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనని తేలిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది మూడు సినిమాలతో అలరించిన తమన్నా.. చిరంజీవి హీరోగా వస్తున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇదికాక, మళయాళ, హిందీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Actress Tamannaah Bhatia reacted to the marriage news