తమన్నా.. నీతులు వల్లించకు, సాయిపల్లవిని చూసి నేర్చుకో.. నెటిజన్లు  - MicTv.in - Telugu News
mictv telugu

తమన్నా.. నీతులు వల్లించకు, సాయిపల్లవిని చూసి నేర్చుకో.. నెటిజన్లు 

June 6, 2020

cvb cvgb

మిల్క్ బ్యూటీగా పేరొందిన నటి తమన్నా అప్పుడప్పుడూ సామాజిక విషయాలపై స్పందింస్తుంది. అయితే సరైన అవగాహన లేక కొన్నిసార్లు చిక్కుల్లో పడుతూ ఉంటుంది. సెలబ్రిటీలను నిత్యం కనిపెడుతూ ఉంటే నెటిజన్లు మంచి చేస్తో ఆహా, ఓహో అని పొగడ్డమే కాకుండా ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తే ఉతికి ఆరేస్తుంటారు కూడా. 

అమెరికాలో నల్లజాతి వ్యక్తి జార్జి ఫ్లాయిడ్ హత్యకు, కేరళలో గర్భిణి ఏనుగు హత్యకు నిరసనగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా కూడా పోస్ట్ పెట్టింది. ‘మీ మౌనం నిన్ను కాపాడదు. మనిషి, జంతువు ఎవరి ప్రాణమైనా ముఖ్యమే కదా. మనం మళ్లీ మనిషులగా జీవించడం నేర్చుకోవాలి..’ అని ట్వీట్ చేసింది. 

దీన్ని కొందరు ఆహ్వానించగా మరికొందరు మండిపడుతున్నారు. చర్మం తెల్లగా అవుతుందని ప్రచారం చేసే ఫెయిర్ నెస్ క్రిముల వ్యాపార ప్రకటనల్లో నటించే తమన్నా నల్లజాతి నిరసనలకు మద్దతు తెలపడం నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగించే తారలు  కనీసం జాతివివక్ష, బాడీ షేమింగ్ కు పాల్పడే ప్రచారాలకైనా దూరంగా ఉండాలి కోరుతున్నారు. కాస్మెటిక్స్ ప్రకటనల్ల నటించనని చెప్పిన మరో నటి సాయిపల్లవిని ఆదర్శంగా తీసుకోవలని కొందరు సూచిస్తున్నారు.