వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై తాప్సీ విమర్శ - MicTv.in - Telugu News
mictv telugu

వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై తాప్సీ విమర్శ

July 11, 2020

Actress tapsee pannu comment on vikas dubey

కాన్పూర్ కు చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే శుక్రవారం ఉదయం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వికాస్ దుబేను హతమార్చడంతో ఆయన వెనకున్న వ్యక్తులు ఎవరో బయటి ప్రపంచానికి తెలియకుండా పోయిందని అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ మొదలగు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. 

తాజాగా ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ట్వీట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లో సినిమాల్లో జరిగిన సన్నివేశాలు నమ్మశక్యంగా లేవని అందరూ అంటుంటారు…మరి వాళ్లు ఇప్పుడేమంటారు? అంటూ తాప్సీ ట్వీట్ చేశారు. తాప్సీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.