గుడిలో చెప్పులతో తిరిగిన త్రిష.. రచ్చరచ్చ  - MicTv.in - Telugu News
mictv telugu

గుడిలో చెప్పులతో తిరిగిన త్రిష.. రచ్చరచ్చ 

September 6, 2021

త్రిష‌.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోయిన్.. దాదాపు ద‌శాబ్ధ‌కాలం పాటు స్టార్ హీరోయిన్ గా త‌న హవా చాటిన ముద్దుగుమ్మ. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది.. చిత్రసీమ‌లో త‌న‌కుంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించుకుంది. గ‌త కొంత‌కాలంగా స్లో అయిన ఈ అమ్మ‌డు నిత్యం వార్త‌లలో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవ‌లే త్రిష త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతుంద‌ని సామాజిక మాధ్య‌మాల్లో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే వాట‌న్నింటినీ రూమ‌ర్లే అంటూ కొట్టిపారేసిన ఈ ముద్దుగుమ్మ‌..తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న  ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రంలో త్రిష న‌టిస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ లో షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటిస్తున్నారు. 

షూటింగ్ లో భాగంగా శివుడు, నంది విగ్రహాల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో త్రిష‌ చెప్పులు ధ‌రించి ఆలయంలో అటూ అటూ తిరగడం వివాదానికి కార‌ణ‌మైంది. త్రిష తీరుపై ప‌లు హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప‌విత్ర స్థ‌లంలో చెప్పుల‌తో న‌డిచి.. హిందువుల మనోభావాలను గాయపరిచినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ విద్యామండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.