actress urfi javed comments on uday poor incident
mictv telugu

అల్లా క్షమించడన్న నటి.. చంపేస్తానన్న నెటిజన్

June 30, 2022

బిగ్ బాస్, విభిన్న డ్రెస్సులతో ఫేమస్ అయిన నటి ఉర్ఫీ జావేద్ దేశంలోని సమస్యలపై అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది. వాటిపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఉదయ్ పూర్‌లో జరిగిన కన్హయ్యలాల్ హత్యపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉర్ఫీ షేర్ చేసిన పోస్టులో ‘అసలు మనం ఎటు వెళ్తున్నాం. నా పేరు మీద ఇతరులను చంపమని అల్లా చెప్పలేదు. హంతకులను అల్లా క్షమించడు’ అని అభిప్రాయపడింది. మరో పోస్టులో ‘మతాలు, దేవుళ్ల పేరుతో చంపే వీళ్లని చూసి జనాలు అసహ్యించుకుంటున్నారు. కానీ ఒకటి ఆలోచించండి. చదువు, మహిళా సాధికారత, రేప్ కేసులో సత్వర న్యాయం, జీడీపీ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం. నైతికత, విలువల కోసం మతాలు ఏర్పడ్డాయి. కానీ, నేటి ఆధునిక కాలంలో పైశాచికత్వానికి అదే మతం కారణం కావడం దురదృష్టకరం. తీవ్ర, ఉగ్రవాదంతో నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఈ పోస్ట్ తర్వాత నన్ను చాలా మంది అసహ్యించుకుంటారని తెలుసు. కానీ, మీలా నేను తీవ్రవాది కాకపోవడం సంతోషం కలిగించే అంశం’ అని రాసుకొచ్చింది. ఇది చూసిన సాజిద్ నెటిజన్ నటిని బూతులు తిడుతూ, చంపేస్తానని బెదిరించాడు. దానిని కూడా షేర్ చేసిన ఉర్ఫీ.. మతం పేరుతో రెచ్చిపోతున్న ఈ వ్యక్తిపై కేసు పెడతాను. దీంతో మిగతా వారికి బుద్ధి వస్తుంది. జైల్లో ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటు సాజిద్’ అంటూ ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది.