actress varsha bollamma clarity on marriage with cene producer son
mictv telugu

నిర్మాత కొడుకుతో పెళ్లా… వర్ష బొల్లమ్మ ఏం చెప్పిందటే..

October 29, 2022

2019లో ‘చూసి చూడంగానే’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చి.. ఓటీటీ హిట్ మూవీ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ. తాజాగా బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ ఎంట్రీ మూవీ ‘స్వాతిముత్యం’తో మరో హిట్ అందుకుంది. వరుసగా హిట్స్ కొడుతూ ఇప్పుడిప్పుడే కెరీర్‌లో సెట్ అవుతున్న వర్షపై పెళ్లి పుకార్లు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రెటీల పెళ్లి, ప్రేమ వ్యవహారాలపై ఊహాగానాలు మూమూలే అయినా.. ఇలా వర్ష లాంటి కొత్త హీరోయిన్స్‌పై పుకార్లు రావటం అరుదు. నిన్నటి నుండి వర్ష పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ పెళ్లి కథనాలపై వర్ష బొల్లమ్మ స్పందించింది.

తాను త్వరలో ఎవరో ప్రముఖ నిర్మాత కొడుకును పెళ్లి చేసుకోనున్నట్టు వస్తున్న వదంతులను కొట్టిపడేసింది వర్ష. ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందిస్తూ.. వర్షా బొల్లమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చిన వ్యక్తిని పరిచయం చేయమని మీడియాను అభ్యర్థించింది. తద్వారా అతనిని తన కుటుంబానికి కూడా పరిచయం చేయవచ్చు అంటూ వ్యంగ్యంగా ఇంస్టాలో పోస్ట్ పెట్టింది. నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయడానికి బదులుగా.. ‘ఆహా’లో ప్రసారం అవుతున్న తన చిత్రం స్వాతిముత్యాన్ని చూడాలని వర్ష అందరినీ అభ్యర్థించింది. ప్రస్తుతం స్వాతిముత్యం హిట్‌తో వర్ష బొల్లమ్మ పలు తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లు కమిట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఆమె తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించి మరో రెండు నెలల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.