‘మీటూ’ ఉద్యమ స్పూర్తితో ఎంతోమంది బాధిత మహిళలు బయటికొస్తున్నారు. తమకి జరిగిన అన్యాయాన్ని దైర్యంగా మీడియాకి చెప్తున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్.. వెండితెర, బుల్లితెర అని తేడాలేకుండా నటీమణులంతా వేధింపులకు పాల్పడ్డ దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బహిరంగంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా భోజ్‌పురిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న హీరోయిన్.. ఒక హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. గాయకుడిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగిన పవన్ సింగ్‌పై హీరోయిన్ యామినీ సింగ్ తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. పవన్ తనను రాత్రికి రమ్మని అడిగాడని నటి వెల్లడించింది.
ఒక ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘హీరో పవన్ సింగ్ నాకు మూవీ ఛాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అది చాలా రాంగ్. నా మొదటి సినిమా ‘బాస్’ అవకాశమిచ్చింది దర్శకుడు అరవింద్ చౌబే. ఈ చిత్రం నుంచి నన్ను ఎవరూ తీసేయలేదు. నేను తప్పుకొన్నాను. పవన్ చాలా మంచి యాక్టర్ అని నాకు అప్పటికి తెలుసు. సెట్స్‌లో ఫస్ట్ టైం కలిసినప్పుడు అతడితో అదే చెప్పాను. అప్పటివరకు అతడి గురించి నిజం నాకు తెలియదు. ఎందుకంటే ఓరోజు రాత్రి 9 గంటలకు అనుకుంటా కాల్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రమ్మని అడిగాడు. లేదంటే నేనే వచ్చి నా కారులో పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఈ టైంలో రాలేనని చెబితే.. సినిమా చేయాలని ఉందా లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు కాల్ కట్ చేసి, సినిమా నుంచి సైడ్ అయిపోయాను’ అని యామినీ చెప్పుకొచ్చింది.