భారత్, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ ఆదానీని ఒక రిపోర్టు ఆందోళనకు గురి చేసింది. ఒక్క రోజులోనే ఆయన సంపదలోనుంచి 48వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అదానీ గ్రూప్ వాటాలను తారుమారు చేసిందని…అకౌంటింగ్ లో మోసం చేసిందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టబడి పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో బుధవారం ఒక్క రోజులోనే అదానీ నికర విలువ భారీగా పడిపోయింది. గణనీయంగా రుణాలు తీసుకున్న అదానీ గ్రూప్ పూర్తిగా ఆర్థిక అనిశ్చితస్థితిలోకి నెట్టివేయబడిందని హిడెన్ బర్గ్ పేర్కొంది.
రాబోయే FPOపై ప్రభావం ఉండవచ్చు
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ఫీఓలు ఇవాళ అంటే శుక్రవారం 27, 2023న జారీ చేస్తారు. శుక్రవారం నుంచి ఈనెల 31వరకు అదానీ గ్రూప్ రూ. 20వేల కోట్ల నిధుల సేకరణకు ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ (FPO)కు వెళ్తున్న నేపథ్యంలో హిడెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం కావడం ఆసక్తికరంగా మారింది. ఇందులో 3112 నుంచి రూ. 3276 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఎఫ్పిఓ కంటే ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 5,985కోట్ల పెట్టుబడులు సేకరించినట్లు అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ బుధవారం ప్రకటించింది.
అదానీ గ్రూప్ షేర్లు
గౌతమ్ అదానీ భారత్‌లోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ సమ్మేళనం అయిన అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు. మార్చి, 2022 స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, అతను అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 75% వాటాను కలిగి ఉన్నాడు. అదానీ టోటల్ గ్యాస్‌లో 37%, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 65% అదానీ గ్రీన్ ఎనర్జీలో 61% విక్రేత కూడా. దేశంలోని మౌలిక వసతుల కల్ఫనకు చర్యలు తీసుకుంటున్న సంస్థ. ఇన్ ఫ్రాతోపాటు కమొడిటీస్, రియల్ ఎస్టెట్ వంటి రంగాల్లో 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సముపార్జిస్తుంది.
ఆదానీ గ్రూప్ పై కీలక వ్యాఖ్యలు
అదానీ గ్రూప్ పై హిడెన్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ నివేదికను ఏమాత్రం పట్టించుకోకుండా అదానీ గ్రూప్ సంస్థల ఆర్థిక ఫలితాలను షేర్ విలువలను పరిశీలించండి. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్ మూలాలు 85శాతం దిగువున్నాయి. కానీ షేర్లు మాత్రం దూసుకుపోతున్నాయి. పెరిగిన షేర్లను తాకట్టు పెట్టి అదానీ గ్రూప్ భారీగా రుణాలు తీసుకుంటుందని హిడెన్‌బర్గ్ స్పష్టం చేసింది.
హిడెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ…
హిడెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. తమ సంస్థపై ద్వేషంతోనే హిడెన్‌బర్గ్ నివేదికను రూపొందించదని పేర్కొంది. నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ కూడా ఏకపక్ష అరోపణలేనని కొట్టిపారేసింది. తమ కంపెనీ షేర్లను నాశనం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు.