ఉత్తర్ ప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న అదానీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తర్ ప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న అదానీ

June 3, 2022

అదానీ గ్రూపు సంస్థల చైర్మెన్ గౌతమ్ అదానీ ఉత్తర ప్రదేశ్‌లో రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీని వల్ల ఆ రాష్ట్రంలో 30 వేల ఉద్యోగాలు వస్తాయని అదానీ శుక్రవారం వెల్లడించారు. ఆ రాష్ట్రంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఆయన మాటల్లోనే ‘ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ, నీరు, వ్యవసాయ, డేటా సెంటర్ల కోసం 11 వేల కోట్లు పెట్టుబడి పెట్టాం. రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం రూ. 24 వేల కోట్లు పెడుతున్నాం. రాష్ట్రంలోని డిఫెన్స్ సెక్టార్‌కి సంబంధించి మందుగుండు సామాగ్రి తదితరాలకు రూ. 35 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. యూపీ డిఫెన్స్ కారిడార్‌లో ప్రైవేటు పరంగా ఇదే అతిపెద్ద పెట్టుబడి కానుంది. యూపీలో పెడుతున్న పెట్టుబడుల వల్ల రాబోయే కాలంలో దేశం ఎలా ఉండబోతుందో యూపీ నిర్వచించబోతోంది. ఈ పెట్టుబడుల ద్వారా సీఎం యోగీ కలలు గన్న ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ సాకారమవుతుంది. ప్రధాని మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. గుజరాత్ అభివృద్ధికి ఏవిధంగా పాటుపడ్డారో, ప్రధాని అయిన తర్వాత దేశం విషయంలో అదే తరహాలో కృషి చేస్తున్నార’ని వెల్లడించారు. కాగా, 2018, 2019లలో వరుసగా రెండు పెట్టుబడిదారుల సమ్మిట్లు జరుగగా, మధ్యలో కరోనా కారణంగా నిర్వహించడం సాధ్యపడలేదు. ఇప్పుడు జరుగుతున్నది మూడో సమ్మిట్.