పార్లమెంటులో ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెలరేగిపోయారు. కేంద్రం మీద నిప్పులు చెరిగారు. అదానీకి, మోడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న పాత పోటో కూడా చూపిస్తూ మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్యా సంబంధాలు ఇప్పటివి కావని రాహుల్ గాంధీ అన్నారు.
రాష్ట్రపతి తీర్మానానికి ధ్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా రాహుల్ మాట్లాడారు. 8ఏళ్ళల్లో అదానీ సంపద 8బిలియన్ డాలర్ల నుంచి 140కు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. అదానీ చేసిన అన్ని వ్యాపారాలు అంతలా సక్సెస్ ఎలా అయ్యాయని, ఆ సీక్రెట్ ఏంటో చెబితే మిగతా వ్యాపారస్థులు కూడా లాభాలు సంపాదిస్తారు కదా అంటూ సెటైర్లు వేశారు. అదానీ కోసం ప్రభుత్వం అన్ని బిజినెస్ రూల్స్ నూ మార్చేసింది అన్నారు రాహుల్. అదానీతో కలిసి మోడీ ఎన్నిసార్లు పై దేశాలకు వెళ్ళరో లెక్క చెప్పాలని అడిగారు. లాస్ట్ 20 ఏళ్ళుగా అదానీ బీజెపీకి ఎంత డబ్బులు ఇచ్చారో అన్ని లెక్కలూ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తన భారత్ జోడో యాత్రలో ఎక్కడికి వెళ్ళినా అదానీ పేరు వినిపించిందనీ….దేశంలోని ఎయిర్ పోర్ట్ లూ, రోడ్లూ, పోర్టులూ అన్ని కాంట్రాక్టులు అతనికే ఇచ్చి కట్టబెట్టారని మండిపడ్డారు. జీవీకేను బెదిరించి ముంబై ఎయిర్ పోర్టును హైజాక్ చేశారని అరోపించారు. దీంతో పాటూ కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని రాహుల్ విమర్శించారు. ఈ ఆలోచన సైన్యం నుంచి వచ్చినది కాదని ఆర్ఎస్ఎస్, కేంద్ర హోంశాఖ కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ విషయాన్ని రిటైర్డ్ సౌన్యాధికారులు తనకు తెలిపారని అన్నారు. నాలుగేళ్ళు సౌన్యంలో పనిచేసిన తర్వాత యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతారని రాహుల్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
Kim Jong Un missing : నెల రోజుల నుంచి కనిపించని ఉ.కొరియా అధ్యక్షుడు
ఏపీకి వెళ్లిపో షర్మిల..జగన్ జైలుకు పోతే అవకాశం వస్తుంది…