అదరగొట్టిన 'ఆర్ఆర్ఆర్..మిన్నంటిన సంబరాలు - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్..మిన్నంటిన సంబరాలు

March 25, 2022

 

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైంది. సినిమా విడుదల కోసం ఎదురుచూసిన అభిమానుల ఆకలి తీరింది. సినిమాను వీక్షించడం కోసం రాంచరణ్ ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో వారి కల సాకారమైంది. సినిమాను వీక్షించిన అనంతరం సినిమా మాములుగా లేదంటూ ఓవైపు రాంచరణ్ ఫ్యాన్స్, మరోవైపు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తున్నారు. కేరింతలతో, నినాదాలతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై ఎన్టీఆర్ అంటూ కొందరు. జై రాంచరణ్ అంటూ మరికొందరు థియేటర్స్ ముందు డ్యాన్స్‌లు వేస్తున్నారు.ఇంకొంతమంది ఫ్యాన్స్ సినిమా హాల్స్ ముందు తమ అభిమాన హీరోల పేరుతో అన్నదానాలు చేస్తున్నారు.

 

గతకొన్ని రోజులుగా సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం విడుద‌లైంది. దేశ, విదేశాల్లో సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల ముందు ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ నామ స్మ‌ర‌ణ‌తో సినీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 

మరోపక్క థియేట‌ర్ల ముందు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌టౌట్ల‌కు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. అభిమానులు ర‌చ్చ చేస్తార‌ని ముందుగానే ఊహించిన థియేట‌ర్లు వారిని క‌ట్ట‌డి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయినా అభిమానులను కట్టడి చేయలేకపోతున్నారు. కొన్ని థియేట‌ర్లలో తెర ర‌క్ష‌ణ కోసం బారికేడ్లు, ఇనుప చువ్వ‌ల‌ను అమ‌ర్చ‌డం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో బాణ‌సంచా కాల్చుతూ, కొబ్బ‌రికాయ‌లు కొడుతూ, డ్యాన్సులు చేస్తూ అభిమానులు అంబ‌రాన్నంటే సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. కొన్ని థియేట‌ర్ల‌లో ‘నాటు నాటు’ సాంగు వ‌చ్చిన స‌మ‌యంలో అభిమానులు తెర‌వ‌ద్ద‌కు వెళ్లి డ్యాన్సులు చేశారు.