ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్..ఈపీఎఫ్ఓ…సభ్యులందరూ నామినీలను వారి ఖాతాలకు చేర్చుకోవడం తప్పనిసరి చేసింది. మీరు కూడా ఫార్మల్ సెక్టార్‌లో పని చేసి, ఈపీఎఫ్ మీ ఖాతాలో ఇంకా ఇ-నామినేషన్ చేయలేదా. అయితే మీరు డబ్బును విత్‌డ్రా చేయడం నుండి అనేక ముఖ్యమైన పనులను చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈఫీఎఫ్ఓలో ఇ నామినీని నమోదు చేయడంలో ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
EPFOలో నామినీని చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఈపీఎఫ్ఓకి నామినీని చేర్చినట్లయితే మీరు మీ పీఎఫ్ డబ్బును ఆన్‌లైన్‌లో సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓలో ఇ-నామినేషన్‌పై, ఏడు లక్షల రూపాయల ఆన్‌లైన్ బీమాను పొందుతారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే మీ కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇ-నామినేషన్ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కూడా పేపర్‌లెస్, ఆన్‌లైన్‌గా మారుతుంది.
EPFOలో నామినీని చేర్చకుంటే కలిగే నష్టాలు:
ఖాతాదారుడు నామినీని చేర్చుకోకపోతే, అతను EPFO అందించే సౌకర్యాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మీరు వైద్యం కోసం తప్ప మరేదైనా అవసరం కోసం డబ్బు తీసుకోలేరు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఈ క్రింది దశలను అనుసరించి వెంటనే EPFO ఖాతాలో ఇ-నామినేషన్‌ను ఫైల్ చేయండి.
EPF ఖాతాలో ఇ-నామినేషన్ ఎలా చేయాలి:
– ఇ-నామినేషన్ కోసం, ముందుగా మీరు EPFO వెబ్‌సైట్‌కి వెళ్లి UAN నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.
– దీని తర్వాత, నిర్వహించండి ట్యాబ్‌కు వెళ్లి ఇ-నామినేషన్‌పై క్లిక్ చేయండి.
-ఇ-నామినేషన్ పేజీ ఒపెన్ అవుతుంది. అందులో మొత్తం సమాచారాన్ని నమోదు చేయాలి.
– ఫోటోతో పాటు మొత్తం సమాచారాన్ని సమర్పించి, సేవ్ చేయండి.
– మీరు ఒకటి కంటే ఎక్కువ నామినీల పేర్లను చేర్చాలనుకుంటే, యాడ్ బటన్‌పై క్లిక్ చేయండి.
– ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలు చేర్చిన తర్వాత నామినేషన్ వివరాలపై క్లిక్ చేసి, నామినీ వాటాను తెలపండి.
– ఆ తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పై క్లిక్ చేయండి.
– ఇప్పుడు OTPని క్రియేట్ చేసేందుకు ఇ-సైన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
– ఇప్పుడు మీ ఇ-నామినేషన్ పూర్తవుతుంది.