యాదాద్రి: పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రి: పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు

May 4, 2022

యాదగిరిగుట్ట కొండపై పార్కింగ్ ఫీజు విషయంలో దేవస్థాన కమిటీ వెన‌క్కి త‌గ్గింది. పార్కింగ్​కు అదనపు గంటగా నిర్ణయించిన రూ.100 అదనపు రుసుము ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండపైకి వెళ్లే ఫోర్ వీలర్ల పార్కింగ్ ఫీజు రూ.500 మాత్రం యథాతధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీనితో యాదాద్రి భక్తులకు కాస్త ఊరట కలగనుంది.

అంత‌కు ముందు కొండపై పార్క్ చేసిన ఫోర్ వీల‌ర్ కు గంట‌కు రూ. 500 , ఆ త‌ర్వాత ప్ర‌తి గంట‌కు రూ.100 వసూలు చేస్తామని తెలిపారు. మే 1 నుంచే పార్కింగ్ వసూలు చేయాలని నిర్ణయించారు.అయితే ఈ వ్యవహారంపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆలయ కమిటీ వెనక్కి తగ్గింది.