ఈనెల 27న నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మోదీ నాగాలాండ్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం చుమౌకెడిమా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారం పాల్గొన్న మోదీ…అనంతరం ప్రసంగించారు. నాగాలాండ్‌కు తొలి మహిళా రాజ్యసభ ఎంపీని ఇచ్చే అవకాశం కూడా ఎన్డీయేకు దక్కిందని ప్రధాని మోదీ అన్నారు. మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ నాగాలాండ్ వైపు చూడలేదని, రాష్ట్రంలో సుస్థిరత, శ్రేయస్సుకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. నాగాలాండ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్‌తో నడిపేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను ఆచరించిందన్నారు.
శాంతి, ప్రగతి, శ్రేయస్సు మా ప్రధాన మంత్రం:
నాగాలాండ్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో శాంతి, ప్రగతి, శ్రేయస్సు అనేదే తమ ప్రధాన మంత్రమని, అందుకే బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యనించారు. ఈశాన్యంలో పరిస్థితి మారుతుందని 10 సంవత్సరాల క్రితం ఎవరూ కలలో ఊహించి ఉండరన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని బీజేపీ అవినీతికి పెద్దపీట వేసిందన్నారు. పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుందన్నారు మోదీ.
నాగాలాండ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది:
ప్రధాని మోదీ కూడా అభివృద్ధి అంశంపై మాట్లాడారు. నాగాలాండ్ నుంచి కోహిమాకు రైలు మార్గం ద్వారా అనుసంధానం చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. రైల్వేతో అనుసంధానం కాగానే ఇక్కడ ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుందని తెలిపారు. పర్యాటకం నుండి సాంకేతికత, క్రీడల నుంచి స్టార్టప్‌ల వరకు, భారత ప్రభుత్వం నాగాలాండ్ యువతకు సహాయం చేస్తోందని ఈ సందర్బంగా మోదీ వ్యాఖ్యానించారు.
Gratitude to the people of Nagaland for their support. We are proud of the state's contribution to our nation. @BJP4Nagaland https://t.co/eTL6lqIYKN
— Narendra Modi (@narendramodi) February 24, 2023