పశ్చిమ బెంగాల్‌లో అడెనోవైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. అక్కడ అడెనోవైరస్ ప్రమాదం మరింత పెరిగింది. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరిన మరో నలుగురు చిన్నారులు మరణించారు. తొమ్మిది రోజుల్లో చిన్నారుల మరణాల సంఖ్య 40కి చేరింది. ఆదివారం ఉదయం ఇద్దరు చిన్నారులు ,బి.సి. రాయ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మరణించారు. అయితే, సాయంత్రం 4 గంటలకు అదే ఆసుపత్రిలో మరో నలుగురు శిశు మరణాలు నమోదయ్యాయి.
ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఈ నాలుగు మరణాలను ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. గత 13 గంటల్లో మరణించిన పిల్లలందరూ జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సాధారణ అడెనోవైరస్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ఫ్లూ లాంటి లక్షణాలతో అడ్మిట్ అయిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ వైద్యులను సూచించింది. పిల్లలు అడెనోవైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
అడెనోవైరస్ ఎలా వ్యాపిస్తుంది. లక్షణాలు
అడెనోవైరస్ సాధారణంగా జలుబు, జ్వరం, శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, న్యుమోనియా, తీవ్రమైన బ్రోన్కైటిస్‌తో సహా ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి . ఈ వైరస్ చర్మాన్ని తాకడం ద్వారా, దగ్గు, తుమ్ముల ద్వారా గాలి ద్వారా ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మల ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు, వైరస్ చికిత్సకు ఆమోదించబడిన మందులు లేదా నిర్దిష్ట చికిత్స ఏవీ లేవు. అడెనోవైరస్ సాధారణంగా పిల్లలలో శ్వాసకోశ, పేగు గొట్టంలో సంక్రమణకు కారణమవుతుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, 0-2 సంవత్సరాల వయస్సు పిల్లలు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. అదే సమయంలో, 2-5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.