ఆధార్ లింకు డిసెంబర్ 31 వరకు - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ లింకు డిసెంబర్ 31 వరకు

August 30, 2017


ఆధార్ అనుంధానంపై గడువుపై బెంబేలెత్తిపోతున్న జనానికి కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ ను లింక్ చేసుకునే గడువును సెప్టెంబర్ 30 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు బుధవారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఆధార్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను కోర్టు పరిశీలిస్తోంది. వీటన్నిటిపైనా నవంబర్ తొలివారంలో విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

సెప్టెంబర్ 30 ఆధార్ లింక్ కు చివరి రోజు కావడంతో ఆలోపే విచారణ జరపాలని పిటిషనర్లు కోరారు. తర్వాత గడువు పెంచినట్లు అటార్నీ జనరల్ కోర్టుకు చెప్పడంతో కోర్టు నవంబర్ తొలివారంలో విచారణ జరుపుతామని చెప్పింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. గ్యాస్, వృద్ధాప్య పింఛను వంటి సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరి. అయితే ఇది తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు పలుమార్లు చెప్పినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.

గ్యాస్, వృద్ధాప్య పింఛను వంటి సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరి. అయితే ఇది తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు పలుమార్లు చెప్పినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.