Adipurush: First poster featuring Prabhas unveiled
mictv telugu

ఆదిపురుష్.. పోస్టర్ రిలీజ్

September 30, 2022

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా ‘ఆదిపురుష్’. బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. శుక్రవారం ఉదయం ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ తో ఉన్న తొలి పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్ లో విల్లు ఎక్కుపెట్టిన రాముడిగా ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక అక్టోబర్ 2న ఈ మూవీ టీజర్ కూడా విడుదల కానుంది. ఆదిపురుష్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రాముడి గెటప్ తో ఉన్న ఫోటోలను డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇవి అధికారిక పోస్టర్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సినిమా గురించి గాసిప్లతో ఇన్బాక్స్లు నిండిపోతున్నాయి. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక అయోధ్యలోని సరయు నది ఒడ్డున ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా దర్శకుడు ఓం రౌత్ ట్వట్టర్ వేదికగా ప్రకటించారు. అక్టోబర్ 2 సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను 2023 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.