ఆదిపురుష్ అప్‌డేట్.. ప్రభాస్ తమ్ముడిగా సుధీర్! - MicTv.in - Telugu News
mictv telugu

ఆదిపురుష్ అప్‌డేట్.. ప్రభాస్ తమ్ముడిగా సుధీర్!

September 21, 2020

Adipurush update .. Sudheer babu as Prabhas younger brother!

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయిని పెంచే సినిమాగా ఈ చిత్రంపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం నాటి కథతో దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు.  చెడుపై మంచి సాధించిన విజయాన్ని సినిమాగా చూపించబోతున్నాడు దర్శకుడు. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులతో పాటు, టాలీవుడ్ -బాలీవుడ్ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ దర్శనం ఇస్తున్నాడు. అలాగే ప్రతినాయకుడిగా (లంకేశ్) పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు లక్ష్మణ్‌గా ఎవరు నటించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ పాత్ర కోసం దర్శకుడు తెలుగు హీరో సుధీర్ బాబును సంప్రదించినట్టు సమాచారం. రాముడి తమ్ముడిగా ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ రాగానే సుధీర్ బాబు కూడా ఓకే అన్నాడని తెలుస్తోంది. జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ గురించి సినిమా యూనిట్ త్వరలో ప్రకటించనున్నారు. 

కాగా, సాహో సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, డార్లింగ్ రాధాకృష దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. పూజాహెగ్డే నటిస్తున్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది.  సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తోంది.