మహా సీఎం ఎవరు.. పోస్టర్ల కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

మహా సీఎం ఎవరు.. పోస్టర్ల కలకలం

October 25, 2019

Adithya ..

మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామం ముగిసింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా తర్వాత స్థానంలో మిత్రపక్షం శివసేన నిలిచింది. దీంతో శివసేన నేతలు సీఎం కుర్చీపై కన్నేశారు. రెండు పార్టీలు చెరి సగం రోజులు సీఎంగా కొనసాగాలంటూ మెలికపెట్టారు. తమ పార్టీ నుంచి ఆధిత్య థాక్రే సీఎంగా అవుతారని, ఆ తర్వాత బీజేపీ నుంచి మిగిలిన రోజులకు సీఎం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే మహారాష్ట్రలో వెలిసిన పోస్టర్లు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

ఆధిత్య థాక్రే నియోజక వర్గం వర్లిలో పోస్టర్లు వెలిశాయి. ‘మా భావి ముఖ్యమంత్రికి హార్థిక శుభాకాంక్షలు’ అంటూ పోస్టరు వెలిశాయి . మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఆదిత్య థాక్రేకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు వెలిశాయి.50-50 ఫార్ములా అమలు చేయాలంటున్నారు. దీంతో తాజాగా వెలిసిన పోస్టర్లు ఆయోమయానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ మహా సీఎం పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ శివసేనను ఎలా దారికి తెచ్చుకోబోతోందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.