మహా సముద్రం సినిమాతో అదితీ రావు, సిద్దార్థ్ జంట ఒక్కటయ్యారనే రూమర్ ఉంది. ఇప్పుడు సహజీవనం చేస్తున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఫేమస్ సాంగ్ కి రీల్ చేసి నెట్టింట ట్రెండింగ్ మారారు.
సిద్దార్థ్ లవర్ బాయ్ గా తెలుగు చిత్ర సీమలో కొనసాగాడు. ఆ తర్వాత మెల్లగా తెలుగు చిత్ర సీమకు దూరమయ్యాడు. ఆ మధ్య మహా సముద్రం సినిమాలో శర్వాతో కలిసి మల్టీ స్టారర్ గా కనిపించాడు. ఆ సమయం నుంచి అదితి, సిద్దార్థ్ ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి తోడు ప్రతీ ఈవెంట్ కు వీరు కలిసి హాజరవుతుండడంతో ఈ పుకార్లకు ఊతమిచ్చినట్టు అవుతన్నది.
అదితి తన ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది.
అందులో ఈ జంట ఎనిమీ సినిమాలోని ‘మారా టమ్ టమ్’ పాటకు కలిసి స్టెప్పులేశారు. ఇద్దరూ నవ్వుతూ ఆడిపాడడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకి ‘డ్యాన్స్ మంకీస్’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది అదితీ. ఇప్పటివరకు వీరు అధికారికంగా వీరి రిలేషన్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ వీడియోను అదితి పోస్ట్ చేయగానే క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయింది.
సెలబ్రిటీలు సైతం వీరి డ్యాన్స్ కి ఫిదా అవుతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక నెటిజన్లు మాత్రం.. ‘త్వరలోనే మీ పెండ్లి ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు వీరి నుంచి అధికార ప్రకటన వస్తుందో వారికే తెలియాలి.
అదితీ రావు హైదరీ సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’లో కనిపించనుంది. ఆమెతో పాటు మనిషా కోయిరాలా, సోనాక్షి సిన్హా ఇతరులు నటిస్తున్నారు. ఈ నెట్ ఫ్లిక్స్ సినిమాతో పాటు జీ 5 కోసం ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించనుంది.