ADITI RAO HYDARI:రాయల్ బ్యూటీ, అందాల నటి అదితి రావ్ హైదరీ బాలీవుడ్ దర్శకులపై హాట్ కామెంట్స్ చేసింది. తన ప్రతిభను బాలీవుడ్ గుర్తించడం లేదని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. హిందీ చిత్ర దర్శకులతో పోల్చితే దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ తన టాలెంట్ ను గుర్తించి తగిన పాత్రలు ఇస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం అదితి బాలీవుడ్ దర్శకులపై చేసిన ఈ హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారితీసింది.
అదితి తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమలలో చాలా వరకు సినిమాల్లో నటించింది. ఈ భామ అందాలు, నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. తెరముందు కనిపించిన ప్రతీ సారి సరికొత్త పాత్రలో దర్శనమిచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది ఈ బ్యూటీ. డీ గ్లామర్ రోల్ నుంచి గ్లామరస్ పాత్ర వరకు అన్నింట్లో ఒదిగిపోయి తన నటనా నైపుణ్యంతో అందరిని మెస్మరైజ్ చేస్తుంటుంది. అయితే నటిగా రాణిస్తున్నప్పటికీ అదితి ఓ విషయంలో బాగా చింతిస్తోందని తన తాజా ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది. మిగతా చిత్ర పరిశ్రమలతో పోల్చితే హిందీలో చెప్పుకోదగ్గ అవకాశాలు ఈ భామకు దక్కడం లేదట. బాలీవుడ్ నుంచి తన టాలెంట్ కు తగిన ఆఫర్లు రాకపోవడంపై ఈ భామ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. హిందీ ఫిల్మ్ మేకర్లు తన ప్రతిభను ఎందుకు ఉపయోగించుకోవడం లేదో తెలియడం లేదని పేర్కొంది.
అదితి కామెంట్ పై బాలీవుడ్ సీనియర్ నటుడు, డర్టీ పిక్చర్ ఫేమ్ హీరో నసీరుద్దీన్ షా స్పందించారు. బాలీవుడ్ లో ఈ పరిస్థితి త్వరలో మారుతుందని భావస్తున్నానని భామ కామెంట్ కు స్పందించారు. “తమిళం, మలయాళ దర్శకులు అధిక తెలివైనవారు కావచ్చు…అదితి లాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇప్పుడైనా , తరువాత అయినా అదితి టాలెంట్ ను గుర్తిస్తారు అని అన్నారు నసీరుద్దీన్ షా.
అదితి రావ్ హైదరీ 2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ 6, యే సాలి జిందగీ, రాక్‌స్టార్, లండన్ పారిస్ న్యూయార్క్, మర్డర్ 3 ,పద్మావత్ వంటి హిందీ చిత్రాలలో నటించి తన నటనతో మెప్పించింది. తెలుగులోనూ అంతరిక్షం, వి, మహా సముద్రం వంటి సినిమాల్లో నటించి తన పాత్రకు న్యాయం చేసింది. ప్రతి సినిమాలో తన నటనలో వేరియేషన్ చూపించి ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ.
ఇదే ఇంటర్వ్యూలో మణిరత్నం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది అదితి. చిన్నప్పటి నుంచి మణిరత్నం హీరోయిన్ కావాలనేది నా కల అని తెలిపింది అదితి. అందుకోసం నేను తమిళం మాట్లాడాలని నాకు తెలుసు, ఎందుకంటే అది ఆయన భాష, మీకు తెలుసా, ఆయన తమిళ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. నేను మా అమ్మ, అమ్మమ్మ, అందరం గొప్ప స్టోరీ టెల్లర్స్ అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ . కథకు భాష, కులం, మతం ఏమీ అడ్డురాదని నేను గ్రహించానంది. కథ అనేది భావాలకు సంబంధించినది, అది అందమైన అనుభూతిని కలిగిస్తుంది అని తెలిపింది.
మరి అమ్మడి ఆవేదనను చూసి ఇప్పటికైనా బాలీవుడ్ దర్శక నిర్మాతలు సరైన అవకాశాలు ఇస్తారని మనమూ ఆశిద్దాం.