గతంలో సమంతను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సిద్దార్థ్‌పై మరోసారి సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నటి అదితి రావు హైదరీ, సిద్దార్థ్ మధ్య ఏదో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు నెట్టింట్లో బ్రేకింగ్ న్యూస్ గా వినిపిస్తున్నాయి. ఓ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో అదితి పోస్ట్ చేయడంతో ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లైంది. అదితి ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ కలిసి చేసిన రీల్‌ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నెట్టింట్లో వైరల్ అయిన పాపులర్ సాంగ్ ‘తుమ్ తుమ్’ సాంగ్ కి ,ఈ జోడీ కలిసి డ్యాన్స్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరిపై లవ్ రూమర్స్ నెట్టింట్లో ఎక్కువయ్యాయి. అయితే తాజాగా అదితి తమ రిలేషన్షిప్ గురించి వస్తున్న పుకార్లపై ఘాటుగానే స్పందించింది. నా వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకంటూ ఫైర్ అయ్యింది.
రీసెంట్గా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ రూమర్స్ పై స్పందించింది అదితి. “నేను నటిగా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతుం నా కెరీర్ పైనే దృష్టి పెట్టాను. మీరు నాలోని నటిని గుర్తించి నన్ను సపోర్ట్ చేసేంత వరకు నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. సినిమాల గురించి, నా అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి నన్ను అడగండి వివరంగా మీకు చెబుతాను. కానీ దయచేసి మీరు నా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టండి” అని చెప్పుకొచ్చింది అదితి. అంతే కానీ వీరిద్దరి మధ్య ఏమీ లేదన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ బ్యూటీ.