aditi-rao-hydari-respond-over-dating-rumours-with-siddharth
mictv telugu

నాకు ఇష్టమైన దానికోసం నేను వెతుక్కుంటాను-అదితీరావ్

March 6, 2023

 aditi-rao-hydari-respond-over-dating-rumours-with-siddharth

జనాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళను మనం ఆపలేం. నేను ఇండస్ట్రీలో పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచీ అన్నీ వింటూనే ఉన్నా అంటున్నారు నటి అదితి రావ్ హైదరీ. ఎవరి ఆసక్తికి తగ్గట్టు వాళ్ళు వెతుక్కుంటారు. నా వరకూ నేను అద్బుతంగా పనిచేయగలనో, ఏ దర్శకులతో పనిచేయడాన్ని ప్రేమిస్తానో, ఎంతకాలం నన్ను ప్రేక్షకులు ఆదరిస్తూ నా సినిమాలు చూస్తారో అప్పటివరకూ నేను చాలా సంతోషంగా ఉంటాను. దాని కోసమే నేను వెతుక్కుంటాను. మిగతా వాళ్ళ గురించి పట్టించుకోను అని చెప్పారు. ఓ ఇంగ్లీష్ పత్రికకకు ఇచ్చిన ఇంటర్వూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు.

అయితే అదితి ఇదంతా ఎందుకు చెప్పారో, ఎవరి కోసం చెప్పారో కూడా అందరికీ తెలిసిందే. కొంతకాలంగా హీరో సిద్ధార్ధ్, అదితీ కలిసి ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే వాళ్ళిద్దరూ కలిసి తిరగడం, ఇంట్లో ఫంక్షన్స్ కు కలిసి హాజరవ్వడం లాంటివి కూడా చేస్తున్నారు. రీసెంట్ గా ఇన్స్టాలో టుమ్ టుమ్ అనే పాటకు కలిసి డాన్స్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టింది అదితి.అదితి పుట్టినరోజుకు సిద్ధార్ధ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ హ్యపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అని కాప్షన్ ఇవ్వడం కూడా రూమర్స్ కు ఊతం ఇచ్చింది.

తెలుగులో వచ్చిన మహాసముద్రం అనే సినిమాలో సిద్ధార్ధ, అదితి కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్యా రిలేషన్ స్టార్ట్ అయింది. అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. తమ పనులు చేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. ఈ రోజు ఇంటర్వూలో కూడా అదితీ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అస్సలు పట్టించుకోమని తేల్చేసింది.