Adivi Sesh Comments On Nepotism In South
mictv telugu

రెండు హిట్లు పడ్డాయో లేదో.. స్టార్ హీరోల ఫ్యామిలీస్ పై సెటైర్స్..!

January 7, 2023

Adivi Sesh Comments On Nepotism In South

టాలీవుడ్ మిడిల్ రేంజి హీరోల్లో అడివి శేష్‌కి మంచి సక్సెస్ రేట్ ఉంది. కథలపై అవగాహనా, దర్శకత్వంపై పట్టు, మంచి యాక్టింగ్ ఎబిలిటీస్ అడివిశేష్ సొంతం. ఈ మెళుకువలతోనే వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు అడివి శేష్. క్షణం చిత్రంతో మొదలైన శేష్ ప్రభంజనం.. గూఢచారి, ఎవరు, హిట్ 2 వంటి సూపర్ హిట్స్ తో కొనసాగుతూనే ఉంది. అయితే బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో స్టార్ హీరో స్థాయికి వెళ్తున్న అడివిశేష్ కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తనపనేదో తానూ చేసుకుంటూ.. ఎలాంటి వివాదాలకు కూడా వెళ్ళడని అంటారు. అలాంటిది తొలిసారి కంటెంట్ వదిలేసి కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు అడివిశేష్. బాలీవుడ్ లో ఎప్పటి నుండో వివాదంగా ఉన్న నేపోటిజంపై హాట్ కామెంట్స్ చేశాడు. సౌత్ సినీ పరిశ్రమలో కూడా ఈ బెడద ఉందని సున్నితంగా సెటైర్స్ వేసి ఇప్పుడు అభిమానులచే తిట్లు తింటున్నాడు అడివిశేష్. తన సినిమాలకు తానే రచన అందించుకోవడం వల్లే విజయాలు వస్తున్నాయని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటమే కాకుండా.. తానె ఎందుకు స్టోరీ సిద్ధం చేస్తానో అన్నదానికి వివరణ ఇచ్చాడు శేష్.

ఒక బాలీవుడ్ మీడియాతో అడివిశేష్ తాజాగా మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యామిలీ నుండి పది మంది హీరోలు ఉన్నారు. వారందరిని దాటుకుని మంచి కథలు బ్యాక్ గ్రౌండ్ లేని వారి వద్దకు రావాలంటే కాస్త కష్టమే. మంచి కథలు 20 మాత్రమే ఉంటాయి. ఒక స్క్రిప్ట్ కు బ్యాక్ గ్రౌండ్ లేని వారు 53వ ఎంపిక అన్నట్లుగా అడవి శేష్ నవ్వుతూ వ్యాఖ్యలు చేశాడు. తాను గొప్ప రచయితను కాకున్నా తన కోసం తాను అన్నట్లుగా కొన్ని కథలు రాసుకుంటున్నట్లుగా శేష్ అన్నారు. అయితే ఇక్కడ తన గొప్పతనం గురించి చెప్తూ ఇతర హీరోలపై సెటైర్స్ ఎందుకని హీరోల ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. రెండు, మూడు హిట్స్ పడ్డాయో లేదో.. స్టార్ వారసులపై ఏడుపు మొదలు పెట్టడం ఏంటని అంటున్నారు. ఎవరి కష్టం వారిది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ట్యాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరు మిగలరు కదా అని అంటున్నారు. ఏదేమైనా హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఇండస్ట్రీ పై పంచ్ లు వేయటం సరికాదని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.