adivi seshs hit 2 removed from prime video
mictv telugu

అడివి శేష్‌కు షాక్.. ఓటీటీ నుంచి ‘హిట్2’ ఔట్..!

January 4, 2023

మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ అడివి శేష్ లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్: ది సెకండ్ కేస్. హీరో నాని నిర్మాతగా.. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 2 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇంకా క్రేజ్ తగ్గని ఈ చిత్రం ఇటీవలే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న స్ట్రీమింగ్ కి సిద్దమవ్వగా.. ఇంతలోనే ఓటీటీ లవర్స్ కి షాక్ తగిలింది. విడుదలైన 24గంటల్లోనే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ నుండి హిట్ 2ని తొలగించేశారు. అయితే డిసెంబర్ 2న థియేటర్లో విడుదలైన హిట్ 2ని మొదట ఫ్రీ స్ట్రీమింగ్ మరియు రెంటల్ బేసిస్‌ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంచారు. దాంతో ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు పూర్తికాగా.. రూ. 129 రెంటల్ బేసిస్‌పై డిసెంబర్ 3 మంగళవారం నుంచి ప్రైమ్ యూజర్లకి అందుబాటులో ఉండనుందని న్యూస్ కూడా వచ్చేసింది.

ఇక అదే సమయంలో యాప్ సబ్‌స్రైబర్స్‌కు జనవరి 6 నుంచి ఫ్రీ స్ట్రీమ్ అవుతుందనే వార్త కూడా బయటికొచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సెకండ్ కేస్ ని రెంటల్ బేస్‌ స్ట్రీమింగ్‌‌ నుండి తొలగించేశారు. వీక్షిద్దాం అనుకున్న సబ్‌స్రైబర్స్‌కు ఎక్కడ హిట్ 2 పేరు కనిపించక పోవటంతో అందరు షాక్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం హిట్ 2ని డిసెంబర్ 6న తిరిగి ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారట. అప్పుడు రెంటల్ బేస్ కాకుండా సబ్‌స్క్రైబర్లకు నేరుగా సినిమా వీక్షించే అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు. ఇక అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సుహాస్, రావు రమేష్, కోమలీ ప్రసాద్ వంటి నటీనటులు ప్రముఖ పాత్రలు పోషించారు.