Adivi Sesh's Hit: The Second Case gets a release date
mictv telugu

అడివి శేష్ “హిట్: ది సెకండ్ కేస్” రిలీజ్ డేట్ ఫిక్స్

September 15, 2022

 

అడివి శేష్ హీరోగా నటిస్తోన్న మూవీ హిట్ -2. “హిట్: ది ఫస్ట్ కేస్” మూవీకి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. విశ్వ‌క్ సేన్ న‌టించిన హిట్: ది ఫస్ట్ కేస్ మూవీకి ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన శైలేష్ కొలను “హిట్: ది సెకండ్ కేస్” సీక్వెల్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఈ మూవీ డిసెంబ‌ర్ 2న థియేటర్లలో విడుదల కానున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.

ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ ముఖ్యమైన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక నటుడు నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.