Adivi Shesh, on Siddus..Bandla Ganesh Hot Comments
mictv telugu

అడివి శేష్, సిద్దులపై..బండ్ల గణేశ్ హాట్ కామెంట్స్

September 14, 2022

 

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యువ హీరోల హవా కొనసాగుతుంది. కొత్త కొత్త కథలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో ‘డీజే టీల్లు’ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఎంతటి విజయాన్ని సాధించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత అడవి శేష్ తాజాగా నటించిన ‘మేజర్’ సినిమా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో యువ హీరోలైనా అడివి శేష్‌‌కి, సిద్దు జొన్నలగడ్డకి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది.

ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీర అభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అడివి శేష్‌‌కి, సిద్దు జొన్నలగడ్డలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అడివి శేష్‌‌కి, సిద్దులు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఫోటోలను షేరు చేస్తూ, ”నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం” అని బుధవారం ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే…ఆ ఇద్దరి యువ హీరోల ఫోటోలతోపాటు వాటికి తోడుగా చేతులు కట్టుకుని వినయంగా కూర్చున్న పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేయటం హాట్ టాపిక్‌గా మారింది.